చిత్రం : స్వయంవరం (1982)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాసరి
గానం : బాలు
ముసుగేసిన మబ్బులలో
మసకేసిన పరదాలలో
దాగిదాగి ఉన్న జాబిల్లి
ఒకసారినువ్వు రావాలి
ఒక మాట నే చెప్పాలి
నీతో మాట చెప్పి పోవాలి
ముసుగేసిన మబ్బులలో
మసకేసిన పరదాలలో
దాగిదాగి ఉన్న జాబిల్లి
ఒకసారినువ్వు రావాలి
ఒక మాట నే చెప్పాలి
నీతో మాట చెప్పి పోవాలి
ఆహా..ఆ..ఆఆఆఆఆ..ఆ..ఆ
ఆ..ఆఆఆఆఆ..ఆ..ఆ..ఆఆ..ఆఆ
ఏ హృదయం నిను మార్చిందో
మనసు మార్చుకున్నావు
ఏ విధి నాపై పగపట్టిందో
తెరలు తెంచుకున్నావు
అవధులు లేని అనురాగానికి
అనుమానం పొగమంచు అని
మంచు కరిగిన మరు నిముషంలో
అనురాగం ఒక కోవెలని
తెలియక తొందర పడ్డావు
తెలియక తొందర పడ్డావు
ఈ ప్రశ్నకు బదులేమిస్తావు
ఈ ప్రశ్నకు బదులేమిస్తావు
ఒకసారి నువ్వు రావాలి
ఒక మాట నే చెప్పాలి
నీతో మాట చెప్పి పోవాలి
ఏ రాహువు నిను మింగిందో
కనుమరుగై పోయావు
ఏ గ్రహణం నిను పట్టిందో
నను దూరం చేశావు
వెన్నెల కురిసే ఆకాశంలో
అమావాస్య ఒక నల్ల మబ్బని
మబ్బు తొలగిన మరు నిముషంలో
వెన్నెలదే ఆకాశమని
తెలియక తొందర పడ్డావు
ఊఊఊఊఊఊ
తెలియక తొందర పడ్డావు
ఈ ప్రశ్నకు బదులేమిస్తావు
ఈ ప్రశ్నకు బదులేమిస్తావు
ఒకసారి నువ్వు రావాలి
ఒక మాట నే చెప్పాలి
నీతో మాట చెప్పి పోవాలి
ముసుగేసిన మబ్బులలో
మసకేసిన పరదాలలో ఓఓ
దాగిదాగి ఉన్న జాబిల్లి
ఒకసారి నువ్వు రావాలి
ఒక మాట నే చెప్పాలి
నీతో మాట చెప్పి పోవాలి
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon