ముష్టి కళ వచ్చేసిందే బాలా పాట లిరిక్స్ | ఉల్టా పల్టా (1998)

 చిత్రం : ఉల్టా పల్టా (1998)

సంగీతం : ఎమ్.ఎమ్.శ్రీలేఖ  

సాహిత్యం : పొలిశెట్టి  

గానం : ప్రణయ్, శైలజ 


ముష్టి కళ వచ్చేసిందే బాలా

చేత చిప్పట్టుకు వచ్చా ఇలా

ప్రేమ భిక్షా పెట్టమంటూ జోలె పట్టా

నీకోసం ముష్టవతారం ఎత్తానమ్మా

నీ ప్రేమకు గులాము నేనై వచ్చానమ్మా

గేటు ముందు కుక్కల్లే పడి ఉంటానమ్మా

కాదంటే మూసీలో పడి చస్తానమ్మా


ముష్టి కళ వచ్చేసిందే బాలా

చేత చిప్పట్టుకు వచ్చా ఇలా


చెవికోసిన మేకల ఏంటీ గోలా

షాకిస్తే ఔటే నీ యమలీల

అక్కుపక్షి తోకముడిచి చల్ రె చల్ జా

జర ఫేస్ అద్దంలోనా దేఖో దేఖో

జూలోనే లేదిటువంటీ మంకీ ఫేసు

జిడ్డులా పట్టాడమ్మా మెంటల్ కేసూ

లైఫ్ లో లవ్వనకుండా ఇస్తాడోసూ


ముష్టి కళ వచ్చేసిందే బాలా

షాకిస్తే ఔటే నీ యమలీల


దేవదాసునైపోతానే పారూ

మూతి బెండవుతది ముయ్యర నోరూ

హల్లో మిస్సు ఒక్క ఛాన్సు ఇచ్చి చూడూ ప్లీజ్

చెప్పు ఇక తియ్యక ముందే జాగో జాగో

నడ్డి హడ్డి ఇరగక ముందే భాగో భాగో

నీ చెప్పు దెబ్బే నాకు మైసూర్ పాకు

నీ తిట్లే తిరపతి లడ్లే భామా నాకు


చెవికోసిన మేకలా ఏంటీ గోలా

ముష్టి కళ వచ్చేసిందే బాలా

ప్రేమ భిక్షా పెట్టమంటూ జోలె పట్టా


Share This :



sentiment_satisfied Emoticon