చిత్రం : మల్లెపువ్వు (1977)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
మల్లెపువ్వులా వసంతం
మాతోట కొచ్చింది
మరపురాని పాటలా
మనసు తలుపు మూసిన వేళా
మల్లెపువ్వులా వసంతం
మాతోట కొచ్చింది
రాలిపోవు పువ్వు కూడా
రాగాలు తీసిందీ
మధువు గ్రోలి తుమ్మెద సోలి
మత్తులోన మునిగింది
మత్తులోని మధువు
మల్లె నగవు నీకు లేవులే
మల్లెపువ్వులా వసంతం
మాతోట కొచ్చింది
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon