మదిలో విరిసే తీయని రాగం పాట లిరిక్స్ | రెండు కుటుంబాల కథ (1970)

 చిత్రం : రెండు కుటుంబాల కథ (1970)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

సాహిత్యం : దాశరథి

గానం : సుశీల


ఆ.. ఆ... ఆ...

ఆ.. ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ...


మదిలో విరిసే తీయని రాగం

మైమరపించేనూ...

ఏవో మమతలు పెంచేనూ


మదిలో విరిసే తీయని రాగం

మైమరపించేనూ...

ఏవో మమతలు పెంచేనూ


అల్లరి చేసే పిల్లగాలి

మల్లెలు నాపై చల్లు వేళ

అల్లరి చేసే పిల్లగాలి

మల్లెలు నాపై చల్లు వేళ


కోరికలన్నీ ఒకేసారి ఎగసీ..

ఆ.. ఆ.. హా.. ఆ.. ఆ..

కోరికలన్నీ ఒకేసారి ఎగసి

ఆకాశంలో హంసల రీతి

హాయిగ సాగేనులే...


మదిలో విరిసే తీయని రాగం

మైమరపించేనూ...

ఏవో మమతలు పెంచేనూ


పరవశమంది పాట పాడి

గానలహరిలో తేలి ఆడి

పరవశమంది పాట పాడి

గానలహరిలో తేలి ఆడి 


హృదయములోనా

వసంతాలు పూయా

హృదయములోనా

వసంతాలు పూయా

కన్నులలోనా

వెన్నెల కురియా

కాలము కరగాలిలే


మదిలో విరిసే తీయని రాగం

మైమరపించేనూ

ఏవో మమతలు పెంచేనూ

Share This :



sentiment_satisfied Emoticon