చిత్రం : శుభలేఖ+లు (2018)
సంగీతం : కె.ఎమ్.రాథాకృష్ణన్
సాహిత్యం : పెద్దాడ మూర్తి
గానం : కె.ఎమ్.రాథాకృష్ణన్
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
గుణవశన శౌరీ....
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
గుణవశన శౌరీ...
కోరుకున్న కల శిల్పమైన శిల
నిజమయ్యే నిమిషం
ఎదురు చూసినది ఎదను దాచినది
ఎదురయ్యే సమయం
కోరుకున్న కల శిల్పమైన శిల
నిజమయ్యే నిమిషం
ఎదురు చూసినది ఎదను దాచినది
ఎదురయ్యే సమయం
మనసు దేనికై పరుగు తీయునో
మదికి నెమ్మదిని ఎచట ఇచ్చునో
అది వెతికిన ప్రతి ఒకరికి దొరికేనా
ఏమో...
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
గుణవశన శౌరీ...
ప్రేమతోన పెనవేసుకున్న
ప్రతి పయనం అతి మధురం
మాట మాట కలిపేసుకుంటె
మధువొలికిన రుతు పవనం
ప్రేమతోన పెనవేసుకున్న
ప్రతి పయనం అతి మధురం
మాట మాట కలిపేసుకుంటె
మధువొలికిన రుతు పవనం
నిన్ను నిన్నుగా ఏది ఉంచునో
నిన్ను రేపులతొ ఊరడించునో
ఆ చెలిమిని మరువకు మరి ఏనాడైనా
తోడే...
పద్మనాభ పాహి
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
గుణవశన శౌరీ... శౌరీ... శౌరీ..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon