కోపము మానేసి కోరి వరమిచ్చి పాట లిరిక్స్ | తిరుప్పావై గీతగోపాలం

 


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం

సంగీతం : వి.డి.శ్రీకాంత్

సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య

గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


కోపము మానేసి కోరి వరమిచ్చి

గోపికల కరుణించు గోవిందా

కోపము మానేసి కోరి వరమిచ్చి

గోపికల కరుణించు గోవిందా


ఆవుల మందలతో అడవులందు తిరిగి

ఆహారమును పొందు అల్పులము మేమయ్య

అజ్ఞాన మయమైన మా గోప వంశమున

ఆవిర్భవించిన పుణ్యమె మాదయ్యా


మాలోన లోపములు కొల్లలుగ ఉన్నను

మాలోని వాడవై మమ్ము మన్నింతువను

నమ్మకముతో నీదు మర్యాదలెరుగకను

లెమ్మురమ్మని ఏకవచనమ్ము వాడాము


నీ పాటలను పాడి నీ ప్రాపును కోరి

నీ పదములొదలము నిర్మల ముకుందా


కోపము మానేసి కోరి వరమిచ్చి

గోపికల కరుణించు గోవిందా

కోపము మానేసి కోరి వరమిచ్చి

గోపికల కరుణించు గోవిందా   

  

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)