చిత్రం : కోకిలమ్మ (1983)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : సుశీల
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది
ఈనాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
ఈ..నాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
నాడు ఆ రాగమే గుండె జతలో
తానె శృతి చేసి లయకూర్చునో
నాడు ఆ రాగమే గుండె జతలో
తానె శృతి చేసి లయకూర్చునో
అని తల్లి అన్నది.. అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నదీ.. కలలు కన్నది
అని తల్లి అన్నది.. అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నదీ..ఈ.. కలలు కన్నది
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది
ఈ లేత హృదయాన్ని కదిలించినావు
నాలోన రాగాలు పలికించినావు
ఈ లేత హృదయాన్ని కదిలించినావు
నాలోన రాగాలు పలికించినావు
నాకు తెలిసింది నీ నిండు మనసే
నేను పాడేది నీ పాటనే
నాకు తెలిసింది నీ నిండు మనసే
నేను పాడేది నీ పాటనే
అని ఎవరు అన్నది.. అది ఎవరు విన్నది
ఈ చిగురు చెవులకే.. గురుతు ఉన్నది
అని ఎవరు అన్నది.. అది ఎవరు విన్నది
ఈ చిగురు చెవులకే..ఏ.. గురుతు ఉన్నది
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon