చిత్రం : నెంబర్ వన్ (1994)
సంగీతం : ఎస్. వి. కృష్ణా రెడ్డి
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : బాలు, చిత్ర
కోలో కోలో కోయిలమ్మా కొండాకోనా బుల్లెమ్మా
ఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమా
వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా
ఒంపుల్లో జంపాలూగి సయ్యా సయ్యా
గువ్వలా చేరుకో గుండెలోనా
కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా
ఏలో ఏలో చందమామ ఏలాలయ్యా నా ప్రేమా
వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా
సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా
గువ్వలా చేర్చుకో గుండెలోనా
తాకితే ఎర్రాని బుగ్గ కందాలా
మీటితే వయ్యారి వీణ థిల్లానా
కలికిచిలక వలపు చిలకగా
కలువచెలియ కలువ రమ్మనె
కిలకిలలో మురిపెములే అలలు అలలుగా
జల్లులై వెల్లువై పొంగిపోయే
కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా
ఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమా
ఓ ప్రియా లాలించమంది వయ్యారం
మోజులే చెల్లించమంది మోమాటం
చిలిపిచూపు సొగసు నిమరగ
జాజితీగ జడకు అమరగ
గుసగుసలే ఏఏ ఘుమఘుమలై గుబులు రేపగా
ఝుమ్మనే తుమ్మెదై కమ్ముకోవా
కోలో కోలో కోయిలమ్మా కొండాకోనా బుల్లెమ్మా
ఏలో ఏలో చందమామ ఏలాలయ్యా నా ప్రేమా
వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా
సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా
గువ్వలా చేరుకో గుండెలోనా
కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా
ఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon