కోకిల కోకిల కూ అన్నది పాట లిరిక్స్ | పెళ్లి చేసుకుందాం (1997)

 చిత్రం : పెళ్లి చేసుకుందాం (1997)

సంగీతం : కోటి

సాహిత్యం : సాయి శ్రీహర్ష

గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర


కోకిల కోకిల కూ అన్నది

వేచిన ఆమని ఓ అన్నది

దేవత నీవని మమతల కోవెల

తలపు తెరిచి ఉంచాను

ప్రియా ప్రియా జయీభవ కౌగిళ్లలో

సఖీ సఖీ సుఖీభవ సందిళ్లలో 


కోకిల కోకిల కూ అన్నది.. అహ..హహ..హా..

వేచిన ఆమని ఓ అన్నది.. అహ..హహ..హా.. 


గుండె గూటిలో నిండిపోవా

ప్రేమ గువ్వలాగ ఉండిపోవా

ఏడు అడుగుల తోడు రావా

జన్మజన్మలందు నీడ కావా

లోకం మన లోగిలిగా కాలం మన కౌగిలిగా

వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా

ఆ ఆకాశాలే అందేవేళ ఆశలు తీరెనుగా 


కోకిల కోకిల కూ అన్నది.. అహ..హహ..హా..

వేచిన ఆమని ఓ అన్నది.. అహ..హహ..హా.. 


వాలు కళ్లతో వీలునామా

వీలు చూసి ఇవ్వు చాలు భామా

వేళపాళలు ఏలనమ్మా

వీలులేనిదంటు లేదులేమ్మా

మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం

కాలాన్నే ఆపగలం మన ప్రేమను చూపగలం

కలలన్నీ తీరే కమ్మని క్షణమే

కన్నుల ముందుందమ్మ


కోకిల కోకిల కూ అన్నది

వేచిన ఆమని ఓ అన్నది

దేవత నీవని మమతల కోవెల

తలపు తెరిచి ఉంచాను

ప్రియా ప్రియా జయీభవ కౌగిళ్లలో

సఖీ సఖీ సుఖీభవ సందిళ్లలో 


Share This :



sentiment_satisfied Emoticon