చిత్రం : జయసుధ (1979)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : దాసరి
గానం : పి.జయచంద్రన్, సుశీల
కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా
కనుపాప నవ్వింది కనులున్న చోట
కలగన్న చోట అవి కలగన్న చోట
కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా
కలలూరు వేళ కనుమూత పడగా
కనుముందు నీ నీడ కదలాడి రాగా
కలలూరు వేళ కనుమూత పడగా
కనుముందు నీ నీడ కదలాడి రాగా
కనులెందుకు? ఈ కనులెందుకు?
కలలు చెరిగేందుకు చెరిగి పోయేందుకు
కనుల కనుల కలయికలో
కలయికల కలవరింతలలో
కలిగే... కరిగే.... కదిలే.... కదలికలే ఆ కలలూ
ఆ కలల వెలుగులే ఈ కనులు
ఆ కలల వెలుగులే ఈ కనులు
కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా
కనుపాప నవ్వింది కనులున్న చోట
కలగన్న చోట అవి కలగన్న చోట
కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా
తెలవారు వేళ కనురెప్ప విడగా
కనుముందు నీ రూపు కనిపించిపోగా
తెలవారు వేళ కనురెప్ప విడగా
కనుముందు నీ రూపు కనిపించిపోగా
కలలెందుకు? ఆ కలలెందుకు?
కధలు మిగిలేందుకు మిగిలి నిలిచేందుకు
మనసు మనసు ఊహలలో మరపురాని ఊసులలో
విరిసే... కురిసే... మెరిసే... మెరుపులవే ఈ కలలు
ఆ కలల వెలుగులే ఈ కనులు
ఆ కలల వెలుగులే ఈ కనులు
కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా
కనుపాప నవ్వింది కనులున్న చోట
కలగన్న చోట అవి కలగన్న చోట
కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon