కంటి శుక్రవారము గడియ లేడింట పాట లిరిక్స్ | శుక్రవారం మహాలక్ష్మి (1992)

 చిత్రం : శుక్రవారం మహాలక్ష్మి (1992)

సంగీతం : కృష్ణ తేజ

సాహిత్యం : అన్నమాచార్య కీర్తన

గానం : చిత్ర


కంటి శుక్రవారము గడియ లేడింట

అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని॥


సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి

కమ్మని కదంబము కప్పు పన్నీరు

చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి

తుమ్మెద యైచాయతోన నెమ్మది నుండే స్వామిని॥


పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి

తెచ్చి శిరసాదిగ దిగనలది

అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై

నిచ్చెమల్లెపూవు నలె నిటుతానుండే స్వామిని॥


తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచినిప్పు

పట్టి కరగించి వెండి పళ్యాల నించి

దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది

బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని॥

Share This :



sentiment_satisfied Emoticon