ఆల్బం : ఘంటసాల ప్రైవేట్ సాంగ్స్
సంగీతం : ఘంటసాల/సాలూరి ??
సాహిత్యం : ఏ.వేణుగోపాల్
గానం : ఘంటసాల
జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...
సనకాది ఋషులు సన్నుతి చేయ..
లక్ష్మీదేవి నీ పాదములొత్త..
భృగు కోపమున వైకుంఠమిడి..
భూలొకమునే చేరితివయ్యా..
జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...
వల్మీకమున దాగి యుండగా..
రుద్రుడె గోవై పాలివ్వ..
గొల్లడొకడు నీ శిరమున బాదగ..
ఘోరశాపమునె ఇచ్చితివయ్య..
జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...
కానలలోన ఒంటివాడివై తిరుగుతు
వకుళను జేరితివయ్య
వకుళమాతకు ముద్దు బిడ్డవై
మురిపెముతోనే పెరిగితివయ్య
జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...
అంత ఒకదినంబున పూదొటలోన
ఆకాశ రాజు తనయ
శ్రీ పద్మావతీ దేవిని గాంచి...
వలచి వలపించితివో..
మహానుభావా...ఆ..ఆ.ఆ
లోకనాధ నీ కళ్యాణమునకు
కుబేరపతిని ఆశించి
లోకనాధ నీ కళ్యాణమునకు
కుబేరపతిని ఆశించి
ఆ కుబేర ధనముతొ మీకళ్యాణం
మహోత్సవమ్ముగ జరిగిందయ్య
ఆనందమానందమాయెనె.
పరమానందమానందమాయెనే.
ఆనందమానందమాయెనె.
పరమానందమానందమాయెనే.
ధర్మపత్నితో దారిలో ఉన్న
అగస్త్యముని ఆశ్రమంబున
ఆరు మాసములు
అతిధిగా ఉన్నవో..
దేవా..ఆ..ఆ.ఆ.అ
కొండలపైనే తొండమానుడు
అలయమొకటి కట్టించెనయా
కొండలపైనే తొండమానుడు
అలయమొకటి కట్టించెనయా
స్వర్ణ శిఖరపు శేషశైలమున
స్థిరనివాసివై నిలచితివయ్య...
జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...
రమాదేవి నిను వెదకుచు చేరగ
శిలా రూపమున వెలసితివయ్య
రమాదేవి నిను వెదకుచు చేరగ
శిలా రూపమున వెలసితివయ్య
భక్తకోటికిదె నిత్య దర్శనం..
పాపవిమోచన పుణ్య స్థలమయా...
జయ జయ జయ శ్రీ వెంకటేశా
జయ జయ జయ ఓం శ్రితజనపోష
జయ జయ జయ శ్రీ వెంకటేశ...
నీమహత్యపఠనమే మాహా స్తోత్రమయా
నీ దివ్యనామమే కైవల్యమయా
దీనులమము కరుణించవయ...
ఓ వెంకటేశా... ఆఆ..ఆఆ...
నమో వెంకటేశా... నమః శ్రీనివాసా
నమో చిద్విలాసా...నమః పరమపురుషా
నమో తిరుమలేశా.. నమో కలియుగేశా
నమో వేదవేద్య.. నమో విశ్వరూపా
నమో లక్ష్మీనాధ.. నమో జగన్నాధ
నమస్తే....నమస్తే....నమః...ఆ..ఆ..ఆ..అ
ఏడుకొండలవాడ..
వేంకటరమణా...
గోవిందా గోవిందా...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon