గుత్తొంకాయ్‌ కూరోయ్‌ బావా పాట లిరిక్స్ | బసవరాజు అప్పారావు గీతాలు

కవిత సంకలనం :బసవరాజు అప్పారావు గీతాలు
కవిత పేరు :: వెఱ్ఱిపిల్ల


 గుత్తొంకాయ్‌ కూరోయ్‌ బావా!

కోరి వండినానోయ్‌ బావా!

కూరలోపలా నా వలపంతా

కూరిపెట్టినానోయ్‌ బావా!


    కోరికతో తినవోయ్‌ బావా!

తియ్యని పాయసమోయ్‌ బావా!

తీరుగ వండానోయ్‌ బావా!

పాయసమ్ములో నా ప్రేమనియేటి

పాలుబోసినానోయ్‌ బావా!


    బాగని మెచ్చాలోయ్‌ బావా!

కమ్మని పూరీలోయ్‌ బావా!

కర కర వేచానోయ్‌ బావా!

కరకర వేగిన పూరీలతో నా

కాంక్ష వేపినానోయ్‌ బావా!


    కనికరించి తినవోయ్‌ బావా!

వెన్నెల యిదుగోనోయ్‌ బావా!

కన్నుల కింపౌనోయ్‌ బావా!

వెన్నెలలో నా కన్నెవలపనే

వెన్న గలిపినానోయ్‌ బావా!


    వేగముగా రావోయ్‌ బావా!

పువ్వుల సెజ్జిదిగో మల్లే

పువ్వుల బరిచిందోయ్‌ బావా!

పువ్వులలో నా యవ్వనమంతా

పొదిపిపెట్టినానోయ్‌ బావా!

    పదవోయ్‌ పవళింతాం బావా!

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)