గుండె ఆడినా గుండె ఆగినా పాట లిరిక్స్ | క్రిష్ (2006)

 చిత్రం : క్రిష్ (2006)

సంగీతం : రాజేష్ రోషన్

రచన : రాజశ్రీ సుధాకర్

గానం : కునాల్ గాంజావాలా


గుండె ఆడినా గుండె ఆగినా

ఆది ప్రేమ కోసమే లేరా

గుండె ఆడినా గుండె ఆగినా

ఆది ప్రేమ కోసమే లేరా

సాటివాడినీ ప్రేమించకుంటే

బ్రతికుండి లాభం ఏంటిరా

సాటివాడినీ ప్రేమించకుంటే

బ్రతికుండి లాభం ఏంటిరా


నువ్వు చంద్రుడిపై కాలు పెట్టినావట

విశ్వాన్నే గెలిచావటా

కనుశోకంతో కుమిలే వాడ్ని

ఒకసారైన నవ్వించగలవా


ఆ పై వాడు ఈ విషయాన్ని

అడగక మానడు ఓ రోజు


గుండె ఆడినా గుండె ఆగినా

ఆది ప్రేమ కోసమే లేరా

గుండె ఆడినా గుండె ఆగినా

ఆది ప్రేమ కోసమే లేరా

సాటివాడినీ ప్రేమించకుంటే

బ్రతికుండి లాభం ఏంటిరా

సాటివాడినీ ప్రేమించకుంటే

బ్రతికుండి లాభం ఏంటిరా


ఈ జీవితమే ఓ సర్కసు రా

గమ్మత్తులు తప్పవు చూడరా

నువు ప్రేమిస్తే సుఖజీవనము

లేదా కథ కంచికి చేరునురా

పరమార్ధం ఇంతేరా

తెలుసుకుంటే మంచిదిరా


గుండె ఆడినా గుండె ఆగినా

ఆది ప్రేమ కోసమే లేరా

గుండె ఆడినా గుండె ఆగినా

ఆది ప్రేమ కోసమే లేరా

సాటివాడినీ ప్రేమించకుంటే

బ్రతికుండి లాభం ఏంటిరా

సాటివాడినీ ప్రేమించకుంటే

బ్రతికుండి లాభం ఏంటిరా 

Share This :



sentiment_satisfied Emoticon