చిత్రం : శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, సుశీల
ఆ... ఆ... ఆ..
ఆ... ఆ... ఆ.. ఆ..
ఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరో...
నా మానసచోరుడెవరో.. ఎవరో.. అతడెవరో..
తొలిచూపులలో వలపులు చిలికి.. దోచిన మగసిరి దొర ఎవరో..
తొలిచూపులలో వలపులు చిలికి.. దోచిన మగసిరి దొర ఎవరో..
అరయగ హృదయము అర్పించితినే.. ఆదరించునో.. ఆదమరచునో
ఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరో...
వలరాజా? కలువలరాజా? కాడే.. కనులకు కనులకడుపడినాడే..
అకళంకుడే.. హరినాంగుడు కాడే..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
అకళంకుడే.. హరినాంగుడు కాడే.. మరి ఎవరో.. ఏమయినాడో...
ఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరో...
ఎవరో.. తానెవరో... ఆ నవమోహిని.. ఎవరో..
నా మానసహారిణి.. ఎవరో..
ఎవరో.. తానెవరో... ఆ నవమోహిని.. ఎవరో..
నందనవనమానందములో.. తొలిసారిగ పూచిన పువ్వో..
నందనవనమానందములో.. తొలిసారిగ పూచిన పువ్వో..
తొలకరి యవ్వనం ఒలికిన నవ్వో...
తొలకరి యవ్వనం ఒలికిన నవ్వో...
మనసిచ్చినదో.. నను మెచ్చినదో..
ఆ... జవ్వని..
ఎవరో.. తానెవరో... ఆ నవమోహిని.. ఎవరో..
నా మానసహారిణి.. ఎవరో.. ఎవరో.. తానెవరో...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon