చిత్రం : ముఠామేస్త్రి (1993)
సంగీతం : రాజ్ కోటి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర
ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌనగీతమా
వచ్చీరాని వయ్యారాలే వయసాయే
మళ్ళీ మళ్ళీ సాయంత్రాలే మనసాయే
నిజమా… హమ్మమ్మా…
చిలిపి కనుల కబురు వింటే
బిడియమో ఏమో సుడులు రేగింది
పెదవి తొనల మెరుపు కంటే
ఉరుములా నాలో ఉడుకు రేగింది
గుబులో దిగులో వగలైపోయే వేళలో
తనువు తనువు తపనై తాకే వేడిలో
మల్లి జాజి జున్నులా చలి వెన్నెల ముసిరేనిలా
నిజమా… హమ్మమ్మా…
ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌనగీతమా
చిగురు తొడిగే సొగసుకంటే
పొగరుగా ప్రాయం రగిలిపోయింది
ఉలికి నడుము కదుపుతుంటే
తొలకరింతల్లో తొడిమ రాలింది
కుడివైపదిరే శకునాలన్ని హాయిలే
ప్రియమో ఏమో నయగారాలే నీవిలే
గోరింటాకు పూపొద చలి ఆపదా ఇక ఆపదా
నిజమా… హమ్మమ్మా…
ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌనగీతమా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon