చిత్రం : గమనం (2021)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : కృష్ణకాంత్
గానం : జితిన్ రాజ్, విభావరి
ఎంత ఎంత చూసిన
చాలదే ఈ మనసున
ఓ మేరె జాన్
ఎంత ఎంత వేచిన
రాకతోనే తీరెనా
ఈ వేదన
మాటల్లో కూడా తెలుపలేవా
పరదాలు తీసి తెగించలేను
కహూఁ మై క్యా - హై ప్యార్ మే
జో మేరా హాల్
ఎంత ఎంత చూసిన
చాలదే ఈ మనసున
ఓ మేరె జాన్
తాను కాస్త ముందుకొస్తె
ఆగిపోయే ఊపిరి
కానరాని వేళలోన ఉండలేదులే
ఓరకంట చూడగానే
మేలుకోవ ఊహలే
పెదవి దాటి రానే రావు
మనసు మాటలే
ముందులేని అల్లరేదో
కమ్ముకున్న వైఖరి
ఒంటరన్న మాటకింక ఆఖరే కదా
ఎక్కడున్నా ఒక్కసారి
పెరిగిపోవు అలజడి
దోర నవ్వు సోకగానే కలత తీరదా
కహూఁ మై క్యా - హై ప్యార్ మే
జో మేరా హాల్
ఎంత ఎంత చూసిన
చాలదే ఈ మనసున
ఓ మేరె జాన్
ఇన్నినాళ్ళు గుండెలోన
జాడలేని హాయిది
నీడ కూడ రంగు మారే
ప్రాయమే ఇది
దేనినైనా దాటిపోయే
వేగమేమో వయసుది
తరుముతున్న ఆపలేని
అదుపు లేనిది
రెప్పపాటు కాలమైన
ఆగలేని జోరిది
చూడగానే నేల మీద తేలిపోయెనా
నువ్వు వేరు నేను వేరు
అసలు కాని చోటిది
ఇద్ధరింక ఒకటిగానే కలిసెతనమిది
డుబా దియా బురీ తరహ్
యే కైసా ప్యార్
ఎంత ఎంత చూసిన
చాలదే ఈ మనసున
ఓ మేరె జాన్
ఎంత ఎంత వేచిన
రాకతోనే తీరెనా
ఈ వేదన
మాటల్లో కూడా తెలుపలేను
పరదాలు తీసి తెగించలేను
కహూఁ మై క్యా - హై ప్యార్ మే
జో మేరా హాల్!!!
ఎంత ఎంత చూసిన
చాలదే ఈ మనసున
ఓ మేరె జాన్
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon