చిత్రం : వెంకిమామ (2019)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : శ్రీమణి
గానం : పృథ్వీ చంద్ర
ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో
ఒంటికాయ సొంటికొమ్ము
సెంటు కొట్టెరో
ఏ ఊహలు లేని గుండెలో
కొత్త కలల విత్తనాలు
మొలకలేసెరో
ఎడారిలో గోదారిలా
కుడికాలు పెట్టి
అలలు జల్లుతోందిరో
ఏదారికో ఏతీరుకో
ఈ కొంటె అల్లరెళ్ళి
ఆగుతుందిరో
ఈ ఎంకి మామ గుండె
పెంకులెగరగొట్టె టీచరమ్మా
ఈ పెంకి మామ మంకు పట్టు
సంగతేంటొ చూడవమ్మా
ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో
ఒంటికాయ సొంటికొమ్ము
సెంటు కొట్టెరో
ఏ ఊహలు లేని గుండెలో
కొత్త కలల విత్తనాలు
మొలకలేసెరో
హియర్ వి గో
హీ ఈజ్ ద బ్రాండ్ న్యూ
వెంకి మామ వాటె చేంజ్ మామ
హే భామా మామ భామ మామ
హే మీసకట్టు చూడు చీరకట్టు తోటి
సిగ్గే పడుతూ స్నేహమేదొ చేసే
పైర గట్టు చూడు పిల్ల గాలి తోటీ
ఉల్లాసంగా కబురులాడెనే
వానజల్లు వేళ
గొడుగు కింద చోటు కూడా
ఒక్కో అడుగూ తగ్గిపోతు ఉంటే
మండు వేసవేళ
వెన్నెలంటి ఊసు వింటు
ఉల్లాసాలే పెరిగిపోయెనే
ఎడారిలో గోదారిలా
కుడికాలు పెట్టి
అలలు జల్లుతోందిరో
ఏదారికో ఏతీరుకో
ఈ కొంటె అల్లరెళ్ళి
ఆగుతుందిరో
ఈ ఎంకి మామ గుండె
పెంకులెగరగొట్టె టీచరమ్మా
ఈ పెంకి మామ మంకు పట్టు
సంగతేంటొ చూడవమ్మా
ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో
ఒంటికాయ సొంటికొమ్ము
సెంటు కొట్టెరో
ఏ ఊహలు లేని గుండెలో
కొత్త కలల విత్తనాలు
మొలకలేసెరో
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon