ఎందరో మోసిన సుందర భావము పాట లిరిక్స్ | చావుకబురు చల్లగా (2021)

 చిత్రం : చావుకబురు చల్లగా (2021)

సంగీతం : జేక్స్ బిజోయ్

సాహిత్యం : సనారే 

గానం : దీపిక.వి. 


ఎందరో మోసిన సుందర భావము

సుగుణభిరాముని సొంతమయే

సంబర వీధిన ఆతని హృదయము

చలముతో తకధిమి నాట్యమయే


కన్నుల ముందర దేవత రూపము

చూసెడి భాగ్యము దొరికినదీ

తప్పని తెలుపుతు దైవము దిగిన

ఆపితే ఆగని వరుస ఇదీ

 

ఎందరో మోసిన సుందర భావము

సుగుణభిరాముని సొంతమయే


అధరాల ఎరుపుకి నీరాజనం

జలజాక్షి మోముకి నీరాజనం

అధరాల ఎరుపుకి నీరాజనం

జలజాక్షి మోముకి నీరాజనం

అలివేణి తురుముకి అపురూప సొగసుకి

అలివేణి తురుముకి అపురూప సొగసుకి

హృదయాంతరము నుండి 

నీరాజనం ప్రేమ నీరాజనం


ఎందరో మోసిన సుందర భావము

సుగుణభిరాముని సొంతమయే


మకుటము లేని ఏలికసాని

మనసుని కదిపిన మోక్ష ప్రదాయని

వదనము చూడగ మాటే రాని

గారడమున్నద నయనములోని

అడగక నే మది సుమధుర రమణిని

చూపిన క్షణమున వదిలా తనువుని 

కలిసా వలుపుని


ఎందరో మోసిన సుందర భావము

సుగుణభిరాముని సొంతమయే

సంబర వీధిన ఆతని హృదయము

చలముతో తకధిమి నాట్యమయే

కన్నుల ముందర దేవత రూపము

చూసెడి భాగ్యము దొరికినదీ

తప్పని తెలుపుతు దైవము దిగిన

ఆపితే ఆగని వరుస ఇదీ

 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)