చిత్రం : డ్రైవర్ రాముడు (1979)
సంగీతం : కె.చక్రవర్తి
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, సుశీల
ఏమని వర్ణించను
ఏమని వర్ణించను నీ కంటి వెలుగును
వెన్నంటి మనసును వెన్నెల నవ్వును
నీ ఇలవేల్పును ఏమని వర్ణించను...
పైరగాలి లాగా చల్లగా ఉంటాడు
తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు
పైరగాలి లాగా చల్లగా ఉంటాడు
తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు
తీర్చిన బొమ్మలా తీరైనవాడు
తీర్చిన బొమ్మలా తీరైనవాడు
తీరని రుణమేదో తీర్చుకో వచ్చాడు
ఏమని వర్ణించను...
ఆ...ఆ...ఆ..ఆ...
రాముడు కాడమ్మా నిందలు నమ్మడు
కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు
నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు
నీ పూజ ఫలియించి నీ దేవుడైనాడు
ఏమని వర్ణించను...
ఆ...ఆ...ఆ..ఆ...
కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మా
తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా
కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మా
తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా
ఆ దేవుడెదురైతే వేరేమి కోరను
ఆ దేవుడెదురైతే వేరేమి కోరను
నా అన్న రూపాన్ని చూపితే చాలును
ఏమని ఊహించను నా అన్న రూపును
నాకున్న వెలుగును వెన్నంటి మనసును
నా ఇలవేల్పును ఏమని ఊహించను..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon