చిత్రం : చక్రవాకం (1974)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : సుశీల, రామకృష్ణ
ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో..
వెతుకుతు వెళుతోంది
ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో..
వెతుకుతు వెళుతోంది.. వెతుకుతు వెళుతోంది
వలపు వాన చల్లదనం తెలియనిది..
వయసు వరద పొంగు సంగతే ఎరగనిది
వలపు వాన చల్లదనం తెలియనిది..
వయసు వరద పొంగు సంగతే ఎరగనిది
కలల కెరటాల గలగలలు రేగనిది..
కలల కెరటాల గలగలలు రేగనిది..
గట్టు సరిహద్దు కలతపడి దాటనిది
ఏ మబ్బు మెరిసినదో ఏ జల్లు కురిసినదో..
ఎంతగా మారినది.. ఎందుకో ఉరికినది
ఎంతగా మారినది.. ఎందుకో ఉరికినది
ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది..
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో..
వెతుకుతు వెళుతోంది
అడవి పిల్లల్లే ఎక్కడో ఫుట్టినది..
అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది
అడవి పిల్లల్లే ఎక్కడో ఫుట్టినది..
అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది
మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది
మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది
ఏ మనిషికి మచ్చికకు రానన్నది
ఏ తోడు కలిసినదో.. ఏ లోతు తెలిసినదో
వింతగా మారినది.. వెల్లువై ఉరికినది
వింతగా మారినది.. వెల్లువై ఉరికినది
ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో
వెతుకుతు వెళుతోంది.. వెతుకుతు వెళుతోంది
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon