ఈ కోవెల నీకై వెలిసింది పాట లిరిక్స్ | అండమాన్ అమ్మాయి (1979)

 



చిత్రం : అండమాన్ అమ్మాయి (1979)

సంగీతం : కె.వి. మహదేవన్

సాహిత్యం : ఆత్రేయ

గానం : సుశీల, బాలు


ఈ కోవెల నీకై వెలిసింది 

ఈ వాకిలి నీకై తెరిచింది

రా దేవి తరలి రా 

నా దేవి తరలి రా


ఈ కోవెల నీకై వెలిసింది 

ఈ వాకిలి నీకై తెరిచింది

రా స్వామీ తరలి రా 

నా స్వామి తరలి రా 

 

దేవత గుడిలో లేకున్నా 

దీపం పెడుతూ ఉన్నాను

దేవత గుడిలో లేకున్నా 

దీపం పెడుతూ ఉన్నాను

తిరునాళ్ళెపుడో రాక తప్పదని 

తేరును సిద్ధం చేసాను

 

దేవుడు వస్తాడని రోజూ 

పూవులు ఏరి తెస్తున్నాను

దేవుడు వస్తాడని రోజూ 

పూవులు ఏరి తెస్తున్నాను

రేపటి కోసం చీకటి మూసిన 

తూరుపులాగా ఉన్నాను

తూరుపులాగా ఉన్నాను

 

ఈ కోవెల నీకై వెలిసింది

ఈ వాకిలి నీకై తెరిచింది


మాసిన వెచ్చని కన్నీరూ 

వేసెను చెంపల ముగ్గులను 

మాయని తీయని మక్కువలు 

చూసెను ఎనిమిది దిక్కులను 


దిక్కులన్నీ ఏకమై 

నాకొక్క దిక్కై నిలిచినది 

మక్కువలన్నీ ముడుపులు కట్టి 

మొక్కులుగానే మిగిలినవి 

మొక్కులుగానే మిగిలినవి 


ఈ కోవెల నీకై వెలిసింది

ఈ వాకిలి నీకై తెరిచింది


నీరు వచ్చే ఏరు వచ్చే

ఏరు దాటే ఓడ వచ్చే

నీరు వచ్చే ఏరు వచ్చే

ఏరు దాటే ఓడ వచ్చే

ఓడ నడిపే తోడు దొరికే 

ఒడ్డు చేరే రోజు వచ్చే

 

ఓడ చేరే రేవు వచ్చే 

నీడ చూపే దేవుడొచ్చే

ఓడ చేరే రేవు వచ్చే 

నీడ చూపే దేవుడొచ్చే

రేవులోకి చేరేలోగా 

దేవుడేదో అడ్డువేసే

ఆ..దేవుడేదో అడ్డువేసే

 

ఈ కోవెల నీకై వెలిసింది 

ఈ వాకిలి నీకై తెరిచింది

రా దేవి తరలి రా 

నా స్వామీ తరలి రా

రా దేవి తరలి రా 

నా స్వామీ తరలి రా 

 

Share This :



sentiment_satisfied Emoticon