చిత్రం : నీదీ నాదీ ఒకే కథ (2018)
సంగీతం : సురేష్ బొబ్బిలి
సాహిత్యం : కందికొండ
గానం : చిన్మయి
ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోందీ
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడు ఎరుగనిది కలుగుతోందీ
మండే ఎండల్లో చలి వేస్తోందే
చల్లని చలిలోన చమటడుతోందే
మదిలో ఓ వర్షం మొదలయ్యిందే
ప్రాణం పోయెట్టుందే
తీయని గాయం చేసెను ప్రాయం
బిగ్గరగా నన్ను బిగిసిన ప్రణయం
ఏంటీ మొహం వలపుల తాపం
సంద్రం తాగిన తీరని దాహం
ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోందే
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడు ఎరుగనిది కలుగుతోందే
కలలే చేరే కనుల పక్షుల గుంపులుగా
అలలై నన్ను ముంచే లక్షల ఊహాలిలా
గుండె విరహం తో ఓ మండుతువుందే
తనువేమో ఓ తోడు కోరుతువుందే
అతడే కావాలంటూ అడుగుతువుందే
హృదయం ఈ రోజే...
ఏమిటి చిత్రం ఒకటే ఆత్రం
నాతో నాకయ్యెను చిలిపిగా యుద్దం
నిన్నటి శాంతం అయ్యెను అంతం
నాలో రేగేను చిరు భూకంపం
ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోందే
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడు ఎరుగనిది కలుగుతోందే
కల్లోలం నా ఆనందం ఒకటై ఎగసిందే
కన్నీరు పన్నీరు వరదై ముంచిందే
నా దేహం నాదసలు కానట్టుందే
నిన్నల్లే ఈ రోజు లేనట్టుందే
నేనసలు నేనేనా అనిపిస్తోందే
మైకం కమ్మేసిందే
నిమిషం నిమిషం తీయని నరకం
బాధలో చూస్తున్న నూతన స్వర్గం
మధురం మధురం మరిగెను రుధిరం
సన్నగా వణికెను ఎర్రని అధరం
ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోందే
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడు ఎరుగనిది కలుగుతోందే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon