ఏదో ఏదో అన్నది.. పాట లిరిక్స్ | ముత్యాల ముగ్గు (1975)

 చిత్రం : ముత్యాల ముగ్గు (1975)

సంగీతం : కె.వి. మహదేవన్      

సాహిత్యం : ఆరుద్ర

గానం : రామకృష్ణ


ఏదో ఏదో అన్నది..

ఈ మసకవెలుతురు..ఊ..ఊ

గూటి పడవలో విన్నది..

కొత్త పెళ్ళికూతురు..ఊ


ఏదో ఏదో అన్నది..

ఈ మసక మసకవెలుతురు..ఊ..ఊ

గూటి పడవలో విన్నది..

కొత్త పెళ్ళికూతురు..ఊ


ఒదిగి ఒదిగి కూచుంది..

బిడియపడే వయ్యారం..

ముడుచుకునే కొలది

మరీ మిడిసి పడే సింగారం..

సోయగాల విందులకై..

వేయి కనులు కావాలీ..

ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..


ఏదో ఏదో అన్నది..

ఈ..మసకవెలుతురు..

గూటి పడవలో విన్నది..

కొత్త పెళ్ళికూతురు..


నింగిలోని వేలుపులు..

ఎంత కనికరించారో..ఓ..ఓ

నిన్ను నాకు కానుకగా...

పిలిచి కలిమి నొసగేరూ..ఊ..ఊ

పులకరించు మమతలతో..

పూల పాన్పు వేశారూ..

ఊ..ఊఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..


ఏదో ఏదో అన్నది.. 

ఈ మసక మసకవెలుతురు..ఊ

గూటి పడవలో విన్నది..

కొత్త పెళ్ళికూతురూ..ఊ

ఆ..ఆ..ఆ.ఆ..ఆ

ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)