దొరలనీకు కనులనీరు దొరలదీలోకం పాట లిరిక్స్ | నాలుగు స్తంభాలాట (1982)

 చిత్రం : నాలుగు స్తంభాలాట (1982)

సంగీతం : రాజన్-నాగేంద్ర

రచన : వేటూరి

గానం : పి.సుశీల


దొరలనీకు కనులనీరు దొరలదీలోకం

మగదొరలదీలోకం

కనులలోనే దాచుకోవే కడలిలా శోకం

కన్నెపడుచులా శోకం


నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగిపోయే జగతిలో

నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగిపోయే జగతిలో

నాలుగు పాదాల ధర్మం నడువలేని ప్రగతిలో

నాలుగు స్తంభాల ఆట ఆడబ్రతుకు తెలుసుకో


దొరలనీకు కనులనీరు దొరలదీలోకం

కనులలోనే దాచుకోవే కడలిలా శోకం


వెన్నెలే కరువైననాడు నింగినిండా చుక్కలే

వెన్నెలే కరువైననాడు నింగినిండా చుక్కలే

కన్నెగానే తల్లివైతే కంటినిండా చుక్కలే

నాల్గు మొగముల బ్రహ్మరాసిన

ఖర్మనీకిది తెలుసుకో


దొరలనీకు కనులనీరు దొరలదీలోకం

కనులలోనే దాచుకోవే కడలిలా శోకం


కలవని తీరాల నడుమ గంగలాగా కదిలిపో

కలవని తీరాల నడుమ గంగలాగా కదిలిపో

అమ్మగా ఒక జన్మనిచ్చి అవని నీవై మిగిలిపో

నాలుగు వేదాలసారం అనుభవంలో తెలుసుకో


దొరలనీకు కనులనీరు దొరలదీలోకం

మగదొరలదీలోకం

కనులలోనే దాచుకోవే కడలిలా శోకం

కన్నెపడుచులా శోకం

Share This :



sentiment_satisfied Emoticon