గుప్పెడంత గుండెల్లో పాట లిరిక్స్ | సంతోషం (2002)

 చిత్రం : సంతోషం (2002)

సంగీతం : ఆర్.పి.పట్నాయక్   

సాహిత్యం : కులశేఖర్  

గానం : శంకర్ మహదేవన్   


ధీం ధినక్‌తరి న క్తిక్తోం

ధీం ధినక్‌తరి న క్తిక్తోం

ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం

గుప్పెడంత గుండెల్లో

చెప్పలేని ఆనందం

ఈ క్షణాలే ఎంతో సంతోషం

జీవితం చిరునవ్వుతో

గడిపేయడమే కదా ఆనందం

అందరం మనమందరం

కలిసుంటేనే కదా సంతోషం


ధీం ధినక్‌తరి న క్తిక్తోం

ధీం ధినక్‌తరి న క్తిక్తోం

ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం


అమ్మాయిల చేతలకీ కుర్రాళ్ల

కూతలకీ హద్దంటూ

లేదయ్యో ఈ దినం

సందట్లో సందయ్యో పెళ్లవనీ

జంటలకీ ఆనందం

అందించే ఈ క్షణం

పేకాట రాయళ్ల చేజోరు చూడాలి

ఈ పెళ్లి లోగిళ్లలో

మందేసి చిందేసి అల్లర్లు చేసేరు

కుర్రాళ్లు విడిదింటిలో

కన్నెపిల్లలకు బ్రహ్మచారులకు

కొంటెసైగలే ఇష్టమంట


ధీం ధినక్‌తరి న క్తిక్తోం

ధీం ధినక్‌తరి న క్తిక్తోం

ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం

గుప్పెడంత గుండెల్లో

చెప్పలేని ఆనందం

ఈ క్షణాలే ఎంతో సంతోషం


ఈ పెళ్లిపందిరిలో సరదాల సందడిలో

ఈ నేలకొచ్చిందయ్యో అంబరం

ఈ ఊరు వాడంతా పొంగిపోయేలాగా

ఈ ఇంట జరగాలయ్యో సంబరం

వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు

చేరేది ఈ వేళలో

అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి

ఈ వేదమంత్రాలలో

కన్యదాతకి అప్పగింతలూ

కంటితుడుపులూ తప్పవంట


ధీం ధినక్‌తరి న క్తిక్తోం

ధీం ధినక్‌తరి న క్తిక్తోం

ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం

గుప్పెడంత గుండెల్లో

చెప్పలేని ఆనందం

ఈ క్షణాలే ఎంతో సంతోషం

జీవితం చిరునవ్వుతో

గడిపేయడమే కదా ఆనందం

అందరం మనమందరం

కలిసుంటేనే కదా సంతోషం


ధీం ధినక్‌తరి న క్తిక్తోం

ధీం ధినక్‌తరి న క్తిక్తోం

ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం 


Share This :



sentiment_satisfied Emoticon