చిత్రం : అయ్యప్పస్వామి మహత్యం (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
ధన్యోహం ఓ శబరీశా..
ధన్యోహం ఓ శబరీశా..
ధన్యోహం ఓ శబరీశా
నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశా
నీ శుభరూపం నేటికి చూశా
ఉత్తుంగ శబరిగిరి శృంగ
నిత్య నిస్సంగమంగళాంగ
పంపాతరంగ పుణ్యానుషంగ
మునిహృదయ జలజ భృంగ
ధన్యోహం ఓ శబరీశా
నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశా
బ్రహ్మచారినై భక్తియోగినై
ద్వంద్వము అన్నది వీడి
విగతకామినై మోక్షగామినై
తాపత్రయమును విడిచి
కన్నెసామినై కర్మధారినై
కాలాంబరములు తొడిగి
నీ దరి చేరితి నీలగిరీశా
బంధము తెంచితి పందళవాస
ధన్యోహం ఓ శబరీశా
నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశా
శరణం శరణం భవతరణ
శబరిగిరీశా అయ్యప్ప
శుభదం సుఖదం నీ చరణం
హరిహరపుత్ర అయ్యప్ప
అయనరేఖల సంగమవేళ
మిధ్యావాదపు వధ్యస్థలిలో
శూన్యజగతిలో సూక్ష్మ పరిధిలో
నికరపు వెలుగుల కాంతిపుంజమై
సకలచరాచర సృష్టిదీపమై
మకరజ్యోతిగ వెలిగేది
నీ మహిమ ఒక్కటే అయ్యప్పా
ఈ మహికి దేవుడే అయ్యప్పా
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
శబరిగిరీశా ధన్యోహం శబరిగిరీశా ధన్యోహం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon