చిత్రం : ఛలో (2018)
సంగీతం : మహతి స్వర సాగర్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : అనురాగ్ కులకర్ణి, సాగర్
చూసి చూడంగానే నచ్చేసావే
అడిగి అడగకుండా వచ్చేసావే
నా మనసులోకి .. హో..
అందంగా దూకి
దూరం దూరంగుంటూ ఎం చేసావే
దారం కట్టి గుండె ఎగరేసావే
ఓ చూపుతోటి హో..
ఓ నవ్వుతోటి..
తొలిసారిగా...
నా లోపల...
ఏమయ్యిందో...
తెలిసేదెలా..
నా చిలిపి అల్లర్లు
నా చిన్ని సరదాలు
నీలోనే చూసానులే ..
నీ వంక చూస్తుంటే
అద్దంలో నను నేను
చూస్తున్నట్టే ఉందిలే..
హో...
నీ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే
ఆహ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే
నువ్ నా కంటపడకుండా
నా వెంట పడకుండా
ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే
నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే
నేనెన్నెన్నో యుద్దాలు చేస్తానులే
నే చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను
హామీ ఇస్తునానులే
ఒకటో ఎక్కం కూడా
మరిచిపోయేలాగా
ఒకటే గుర్తొస్తావే ...
నిను చూడకుండా ఉండగలనా
నా చిలిపి అల్లర్లు
నా చిన్ని సరదాలు
నీలోనూ చూసానులే ..
నీ వంక చూస్తుంటే
అద్దంలో నను నేను
చూస్తున్నట్టే ఉందిలే
హో...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon