చూడు చూడు చందమామ పాట లిరిక్స్ | పెళ్ళికొడుకు (1994)


చిత్రం : పెళ్ళికొడుకు (1994)

సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి  

సాహిత్యం : ?? ఆరుద్ర/సినారె

గానం : చిత్ర 


చూడు చూడు చందమామ చూడు

ఈ కోడెగాడు నిద్దరే పోడు

చూడు చూడు చందమామ చూడు

ఈ కోడెగాడు నిద్దరే పోడు

పక్కగదిలో ఒక్కదాన్ననీ

పక్కగదిలో ఒక్క దాన్ననీ

పక్కమీద చేరేట్టున్నాడు

నా పక్కమీద చేరేట్టున్నాడు


చూడు చూడు చందమామ చూడు

ఈ కోడెగాడు నిద్దరే పోడు

చూడు చూడు చందమామ చూడు

ఈ కోడెగాడు నిద్దరే పోడు


తడిసినా కురులను దువ్వి

జడ వేయనా అంటూ

మెడమీద పుట్టుమచ్చనూ

తడిమేయనా అంటూ

ఈ ఉదయం అన్నాడూ

ఎలా ఎలాగో ఉన్నాడూ

ఆదమరచి పడుకుంటే

అల్లరి చేసేట్టున్నాడు

తెగ అల్లరి చేసేట్టున్నాడు

హహహ చూడు చూడు


చూడు చూడు చందమామ చూడు

ఈ కోడెగాడు నిద్దరే పోడు

చూడు చూడు చందమామ చూడు

ఈ కోడెగాడు నిద్దరే పోడు


ఎదపైన పయ్యెద లాగా

ఒదిగిపోనా అంటూ

చిరునడుము పిడికిట పొదిగీ

సరి చూడనా అంటూ

సాయంత్రం అన్నాడు

సన్న సన్నగా నవ్వుకున్నాడు

వీలు చిక్కితే ఓరినాయనో

వీలు చిక్కితే ఓరినాయనో

కిటికీలోంచి దూకేట్టున్నాడు

నా అందమంత దువ్వేట్టున్నాడు


చూడు చూడు చందమామ చూడు

ఈ కోడెగాడు నిద్దరే పోడు

చూడు చూడు చందమామ చూడు

ఈ కోడెగాడు నిద్దరే పోడు


మల్లెపూల మాటునున్న చందమామ

ఈ చిన్నోడి చేష్టలు చూస్తున్నావా

చూస్తున్నావా చూస్తున్నావా

పండు వెన్నెల మత్తు చల్లి

పైరగాలి జోలపాడీ

మెల్ల మెల్లగా జో కొట్టవా

ఈ అల్లరోడ్ని పడుకోబెట్టవా

కాకుంటే కొంపదీసి ఈ రాతిరే

కొల్లగొట్టి పోయేట్టున్నాడు

నన్ను కొల్లగొట్టి పోయేట్టున్నాడు


చూడు చూడు చందమామ చూడు

ఈ కోడెగాడు నిద్దరే పోడు

చూడు చూడు చందమామ చూడు

ఈ కోడెగాడు నిద్దరే పోడు

Share This :



sentiment_satisfied Emoticon