బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది పాట లిరిక్స్ | కొండవీటి సింహం (1981)

 చిత్రం : కొండవీటి సింహం (1981)

సంగీతం : చక్రవర్తి

రచన : వేటూరి

గానం : బాలు, పి.సుశీల


బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది

చిలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది

బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది

చిలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది

అది ఏ తొటదో ఏ పేటదో

అది ఏ తొటదో ఏ పేటదో


బంగినపల్లి మామిడి పండు కోత కొచ్చింది

చిలకే నువ్వని జాంపండు చేతికొచ్చింది

బంగినపల్లి మామిడి పండు కోత కొచ్చింది

చిలకే నువ్వని జాంపండు చేతికొచ్చింది

ఇది నీ కొసమే పండిందిలే

ఇది నీ కొసమే పండిందిలే


పెదవులా రెండు దొండపళ్ళూ

చెక్కిళ్ళా చక్కెరకేళి అరటి పళ్ళు

నీలికన్ను నేరేడు పండు

నీలికన్ను నేరేడు పండు

నిన్ను చూసి నా ఈడు పండు

పాలకొల్లు తొటలోన బత్తాయిలు

వలపుల్ల వడ్లమూడి నారింజలు

పాలకొల్లు తొటలోన బత్తాయిలు

వలపుల్ల వడ్లమూడి నారింజలు

కొత్తపల్లి కొబ్బరంటి చలి కోర్కెలు..

తొలి కాపుకొచ్చాయి నీ చూపులు

ఈ మునిమాపులో..


బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది

చిలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది

ఇది నీ కొసమే పండిందిలే

ఇది నీ కొసమే పండిందిలే


పలుకులా తేనె పనసపళ్ళు

తళుకులా  పచ్చ దబ్బ పళ్ళు

నీకు నేను దానిమ్మ పండు

నీకు నేను దానిమ్మ పండు 

నిన్నుజేరి నా నోము పండు

అరె నూజివీడు సరసాల సందిళ్ళ లో

సరదా సపోటాల సయ్యాటలో

నూజివీడు సరసాల సందిళ్ళ లో

సరదా సపోటాల సయ్యాటలో

చిత్తూరు మామిళ్ళ చిరువిందులే

అందించుకోవాలి అరముద్దులు

మన సరిహద్దులో


బంగినపల్లి మామిడి పండు కోత కొచ్చింది

చిలకే నువ్వని జాంపండు చేతికొచ్చింది

ఇది నీ కొసమే పండిందిలే

ఇది నీ కొసమే పండిందిలే


బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది

చిలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది

అది ఏ తొటదో ఏ పేటదో

అది ఏ తొటదో ఏ పేటదో 


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)