అతసీ పుష్పముల అందము కలవాడా పాట లిరిక్స్ | తిరుప్పావై గీతగోపాలం

 ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం

సంగీతం : వి.డి.శ్రీకాంత్

సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య

గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


అతసీ పుష్పముల అందము కలవాడా

అంతఃపురము వీడి అవతలికి రారా

అతసీ పుష్పముల అందము కలవాడా

అంతఃపురము వీడి అవతలికి రారా


వర్షరుతువునా ఘోర పర్వత గుహలోనా

వనరాజు నిశ్చలుడై నిదురించి మేల్కొని

వాడి చూపులతో వనమంత తిలకించి

వాసనలు నిండిన కేశరమ్ములు పెంచి


అన్నివైపుల దొరల మన్నునంతయు దులిపి

వెన్నెముకను వంచి వెనుక ముందుకు జడిసి

గంభీరముగ వెడలి ఘర్జించి గుహనుండి

డంబముతో అడుగులు ముందుకేసినా రీతీ


రమణీయ కమనీయ రమ్య హర్మ్యము వీడి

లోకోత్తరంబగు సింహాసనంబు కూడి

మేము వచ్చిన కార్యమాలకించుమని

నీ ముందు ప్రార్థనలు చేసేము ప్రతి నిత్యం


అతసీ పుష్పముల అందము కలవాడా

అంతఃపురము వీడి అవతలికి రారా

అతసీ పుష్పముల అందము కలవాడా

అంతఃపురము వీడి అవతలికి రారా  


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)