చిత్రం : కలర్ ఫోటో (2020)
సంగీతం : కాలభైరవ
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ
గానం : అనురాగ్ కులకర్ణి, కాలభైరవ
అరెరే ఆకాశంలోనా
ఇల్లే కడుతున్నావా
సూరీడు కూడా పడలేని సోటా
రంగేసినాడు తలదాసుకుంటా
తన రూపు తానే తెగ సూసుకుంటా
మా కిట్టి గాడు పడ్డాడు తంటా
అరెరే ఆకాశంలోనా
ఇల్లే కడుతున్నానా
ఓ… సిత్రలహరీ పాటంతా తానూ
రేడియోలో గోలంట నేను
బొమ్మ కదిలేలా గొంతు కలిసేనా
టూరింగ్ టాకీసు తెర నువ్వనీ
నేనేమో కట్ అయినా టిక్కెట్టునీ
మన జంట హిట్ అయినా సినిమా అని
అభిమానులే వచ్చి సుత్తారని
పగలు రేయంటూ లేదు…
కలలే కంటూ ఉన్నా
తనతో నుంచుంటే చాలు…
కలరూ ఫొటోలోనా…
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon