చిత్రం : అమ్మోరు ( 2003)
సంగీతం : చక్రవర్తి/శ్రీ
సాహిత్యం : మల్లెమాల
గానం : బాలు, బృందం
అమ్మా..ఆఆఆఆ.. అమ్మోరు తల్లో
అమ్మోరు తల్లో
అమ్మా..అమ్మోరు తల్లో
మా అమ్మలగన్న అమ్మా
బంగారు తల్లో
మా అమ్మలగన్న అమ్మా
బంగారు తల్లో
ఆదిశక్తివి నువ్వేనంట
అపరశక్తివి నువ్వేనంట
ఆదిశక్తివి నువ్వేనంట
అపరశక్తివి నువ్వేనంట
దుష్టశక్తులను ఖతం చేసే
పరాశక్తివి నువ్వేనంట
అమ్మా..అమ్మోరు తల్లో
అమ్మోరు తల్లో
నీ కళ్ళలో సూర్యుడు చంద్రుడు
నిత్యం యెలుగుతు ఉంటారంట
యేదాలన్ని నీ నాలుకపై
ఎపుడూ చిందులు యేస్తాయంట
నీ కళ్ళలో సూర్యుడు చంద్రుడు
నిత్యం యెలుగుతు ఉంటారంట
యేదాలన్ని నీ నాలుకపై
ఎపుడూ చిందులు యేస్తాయంట
నింగి నీకు గొడుగంట
నేల నీకు పీఠమంటా
నిను నమ్మినవాళ్ళ నోముల
పంటకు నారు నీరు నువ్వేనంట
అమ్మా..అమ్మోరు తల్లో
అమ్మోరు తల్లో
మా అమ్మలగన్న అమ్మా
బంగారు తల్లో
మా అమ్మలగన్న అమ్మా
బంగారు తల్లో
ఆఆ.. పడగలు ఎత్తిన పాముల మధ్య
పాలకు ఏడ్చే పాపలమమ్మా
జిత్తులమారి నక్కల మధ్య
దిక్కే తోచని దీనులవమ్మా
పడగలు ఎత్తిన పాముల మధ్య
పాలకు ఏడ్చే పాపలము
జిత్తులమారి నక్కల మధ్య
దిక్కే తోచని దీనులము
బ్రతుకు మాకు సుడిగుండం
ప్రతిరోజు ఆకలిగండం
గాలివానలో రెపరెపలాడే
దీపాలను నువ్వు కాపాడమ్మా
అమ్మా..అమ్మోరు తల్లో
అమ్మోరు తల్లో
మా అమ్మలగన్న అమ్మా
బంగారు తల్లో
మా అమ్మలగన్న అమ్మా
బంగారు తల్లో
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon