అమ్మా మన్ను తినంగ నే శిశువునో పాట లిరిక్స్ | శ్రీ కృష్ణలీలలు (1958)

 చిత్రం : శ్రీ కృష్ణలీలలు (1958)

సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి 

సాహిత్యం : పోతన 

గానం : సుశీల, లీల   


అమ్మా మన్ను తినంగ నే శిశువునో ? యాకొంటినో ? వెర్రినో ?

నమ్మంజూడకు వీరి మాటలు మదిన్; నన్నీవు కొట్టంగ వీ

రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గం

ధమ్మాఘ్రాణము జేసి నా వచనముల్ తప్పైన దండింపవే !!


కలయో ! వైష్ణవ మాయయో ! యితర సంకల్పార్థమో ! సత్యమో

తలపన్నేరక యున్నదాననో ! యశోదాదేవి గానో ! పర

స్థలమో ! బాలకుండెంత ! యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర

జ్వలమై యుండుట కేమి హేతువో ! మహాశ్చర్యంబు చింతింపగన్

 

Share This :



sentiment_satisfied Emoticon