ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా పాట లిరిక్స్ | జగదేకవీరుని కథ (1961)

 చిత్రం : జగదేకవీరుని కథ (1961)

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు 

సాహిత్యం : పింగళి నాగేంద్రరావు

గానం : సుశీల, లీల, సరోజిని, రాజరత్నం


ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా

సేవలంది మాకు వరములీయవమ్మా


కలుగునే మీ వంటి సాధ్వి అత్తగమాకు

తొలి మేము చేసిన పుణ్యమున గాక

మందారమాలతీ పారిజాతాలతో

అందముగ ముడివేసి అలరజేసేము


ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా

సేవలంది మాకు వరములీయవమ్మా


మనసు చల్లన కాగ మంచి గంధము పూసి

మా ముచ్చటలు తీర్ప మనవి చేసేము

పారాణి వెలయించి పాదపూజను చేసి

కోరికలు తీరునని పొంగి పోయేమూ


ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా

సేవలంది మాకు వరములీయవమ్మా 


Share This :



sentiment_satisfied Emoticon