అచ్చ తెనుగులా పదారణాల పాట లిరిక్స్ | పోస్ట్ మాన్ (2000)

 చిత్రం : పోస్ట్ మాన్ (2000)

సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ 

సాహిత్యం : ఘంటాడి కృష్ణ 

గానం : కె.జె.ఏసుదాస్, సుజాత మోహన్


అచ్చ తెనుగులా పదారణాల 

కోమాలాంగివే చెలీ

అచ్చ తెనుగులా పదారణాల 

కోమాలాంగివే చెలీ

సాయంత్ర సంధ్య వేళ నీవే

నా ప్రేమ ముగ్గులోకి రావే

ఆనతివ్వగా నా మోహనా 

నీ హారతవ్వనా ప్రియా

అచ్చ తెనుగులా పదారణాల 

కోమాలాంగివే చెలీ


ఆ ఛైత్ర మాసాలే మన ప్రేమ సాక్ష్యాలై

విడరాని బంధమై పోగా

నా తోడు నీడల్లే నా కంటి పాపల్లే

గుండెల్లో నిన్ను దాచుకోనా

నిన్నే చేరుకోనా ఒడిలొ వాలి పోనా

నా శ్వాసలో నిశ్వాస నీవై

నా జీవితాన ఆశ నీవై 

నా చేయినందుకో రావా


అచ్చ తెనుగులా పదారణాల 

కోమాలాంగివే చెలీ

ఆనతివ్వగా నా మోహనా

నీ హారతవ్వనా ప్రియా


కార్తీక వెన్నెల్లో ఎకాంత వేళల్లో

నీడల్లె నిన్ను చేరుకోన

నీ రూపే కళ్ళల్లొ కదలాడె వేళల్లొ

నీ చంటి పాపనై పోన

జగమె మురిసిపోదా ఒకటై కలసి పోగా

ఆకాశమే అక్షింతలేయ

భూమాతయే దీవించ రాగా

ఆ మూడు ముళ్ళు వేసేనా


ఆనతివ్వగా నా మోహనా

నీ హారతవ్వనా ప్రియా

అచ్చ తెనుగులా పదారణాల 

కోమాలాంగివే చెలీ

సాయంత్ర సంధ్య వేళ నీవే

నా ప్రేమ ముగ్గులోకి రావే


ఆనతివ్వగా నా మోహనా

నీ హారతవ్వనా ప్రియా

అచ్చ తెనుగులా పదారణాల 

కోమాలాంగివే చెలీ



 


Share This :



sentiment_satisfied Emoticon