చిత్రం : మల్లీశ్వరి (1954)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : ఘంటసాల, భానుమతి
ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు
ఏడ తానున్నాడో బావా
జాడ తెలిసిన పోయి రావా
అందాల ఓ మేఘమాల ఆఆ ..
అందాల ఓ మేఘ మాల
గగన సీమల తేలు ఓ మేఘమాలా
మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైన నాతో
మనసు చల్లగా చెప్పిపోవా
నీలాల ఓ మేఘమాలా ఆఆ
రాగాల ఓ మేఘమాలా
మమతలెరిగిన మేఘమాలా
నా మనసు బావకు చెప్పి రావా
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు
ఎదురు తెన్నులు చూచెనే బావకై
చెదరి కాయలు కాచెనే ఏఏ …
నీలాల ఓ మేఘమాలా ఆఆ…
రాగాల మేఘమాలా
మనసు తెలిసిన మేఘమాలా
మరువలేనని చెప్పలేవా
మల్లితో మరువలేనని చెప్పలేవా
కళ్ళు తెరచిన గాని
కళ్ళు మూసిన గాని
మల్లి రూపే నిలిచెనే
నా చెంత మల్లి మాటే పిలిచెనే
జాలి గుండెల మేఘమాలా
బావ లేనిది బ్రతుక జాల
జాలి గుండెల మేఘమాలా
కురియు నా కన్నీరు
గుండెలో దాచుకుని
వాన జల్లుగ కురిసి పోవా
కన్నీరు ఆనవాలుగా బావ బ్రోల
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon