క్యాకరూఁ.. మై క్యాకరూఁ. పాట లిరిక్స్ | 47Days (2018)



చిత్రం : 47Days (2018)

సంగీతం : రఘు కుంచె 

సాహిత్యం : లక్ష్మీభూపాల   

గానం : నీహ కడివెటి

   

క్యాకరూఁ.. మై క్యాకరూఁ

ఆ నవ్వు చూస్తే మాటరాదే క్యాకరూఁ..

పావురాయల్లే నేను పోతుంటే

నీలి మబ్బై దారి కాచాడే

తేనె చుక్కల్లే జారిపోతుంటే

తుమ్మెదల్లే తాను మారాడే

ఓ మాహివే.. మాహివే..  

ఓ మాహివే.. మాహివే..  

క్యాకరూఁ.. ఎంత గడుసోడే

క్యాకరూఁ.. సొంతమయ్యాడే


మనసు నాకైనా చెప్పకుండానే

ఎప్పుడో తనతో వెళ్ళిందా

వయసు రాగానే ఎదురుగా తానే

ఎన్నడో ముడిపడిపోయిందా

ఓయ్ నేస్తమా నా ప్రాణమా

నా తోడుగా ఉంటావనే

వున్నానులే నీ కోసం

చిరుగాలి పరదాల్లో

అలసిన కలువగ

చెలియను ఐతే


క్యాకరూఁ.. ఓ మాహివే

మై క్యాకరూఁ.. ఎంత గడుసోడే


పచ్చబొట్టల్లే మారిపోయాడే

వెచ్చగా నాలో కలిశాడే

కాలి మెట్టల్లే చుట్టుకున్నాడే

జంటగా నాతో నడిచాడే

ఓ అమ్మలా ఈ జన్మలా

కలిశావులే కల కాదుగా

విడిపోనులే చితినైనా

మనసంతా నువ్వైతే

నేనని నువ్వని వేరౌతానా


క్యాకరూఁ..మై క్యాకరూఁ..

ఆ నవ్వు చూస్తే మాటరాదే క్యాకరూఁ..

పావురాయల్లే నేను పోతుంటే

నీలి మబ్బై దారి కాచాడే

తేనె చుక్కల్లే జారిపోతుంటే

తుమ్మెదల్లే తాను మారాడే 


Share This :



sentiment_satisfied Emoticon