వెన్నెలా ఓ వెన్నెలా పాట లిరిక్స్ | నీవెవరో (2018)



చిత్రం : నీవెవరో (2018)

సంగీతం : ప్రసన్ 

సాహిత్యం : శ్రీజో

గానం : సిద్ శ్రీరామ్


వెన్నెలా…. ఓ వెన్నెలా

నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా

నిన్నలా… నే లేనుగా

ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ

ప్రాణం కదిలించిందే నీ స్వరం

అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం, నీ వరం

ఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ


వెన్నెలా…. ఓ వెన్నెలా

నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా

నిన్నలా… నే లేనుగా

ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా..


మాటే విననీ మనసెగిరిపోనీ

చెలిమే రెక్కలివ్వగా

నీకే తెలియదంటున్న

నిజమే లోకం చూడగా

సందేహం వీడనీ

ఈ మాయే మదిలో నిండనీ

సంతోషం పొంగనీ

నీ హృదయం నీలో లేదనీ


ఓ మాటల్లోనే, మోమాటం కరిగించి

నిన్నూ నన్నూ స్నేహం పెనవేసింది

అలావాటే లేదుగా అడిగేది కాదుగా

ఈ వింతల వేడుక చెలిమికి ఋజువేగా

ఎన్నో ఊహల్లో మన ఉనికే వెతికానే

నువ్వే ఎదురైతే

ఆ ఏకాంతంలో నాలో మౌనం మోగదే


వెన్నెలా…. ఓ వెన్నెలా

నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా

నిన్నలా… నే లేనుగా

ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ


ఏ చోటున్నా నను నీలో చూస్తున్నా

నువులేవన్నా తలపే చెరిపేస్తున్నా

అడుగడుగే చీకటై నిశిలో ముంచేసినా

నీ రాకే వేకువై నను నడిపెను ప్రేమా

నీతో క్షణకాలం కలకాలంలా ఉందే

అందం ఆనందం కలగలిపి చూపిస్తున్నా

అద్దం మన కథే!


వెన్నెలా…. ఓ వెన్నెలా

నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా

నిన్నలా… నే లేనుగా

ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ

ప్రాణం కదిలించిందే నీ స్వరం

అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం, నీ వరం

ఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ

వెన్నెలా.


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)