చిత్రం : తొలిప్రేమ (2018)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : శ్రీమణి
గానం : అర్మాన్ మాలిక్
లవ్లీ లవ్లీ మెలోడీ ఎదో
మది లోపల ప్లే చేసా
ఎన్నో ఎన్నో రోజులు వేచిన
నిమిషంలో అడుగేసా
కలాన్నే ఆపేశా
అకాశాన్నే దాటేశా
విన్నానే. విన్నానే.
నీ పెదవే చెబుతుంటే విన్నానే.
ఉన్నానే ఉన్నానే.
తొలిప్రేమై నీలోనే ఉన్నానే
నీ ఎదలో ఎదలో పుట్టెసిందా ప్రేమ నా పైన
నా మనసే మనసే కనిపించింద కాస్త లేట్ అయినా
నీ వెనకే వెనకే వచ్చెస్తూన్నా దూరం ఎంతున్నా
మరి ఎపుడీ ఎపుడీ రోజొస్తుందని వేచిచూస్తున్నా
అరె ఎందరున్నా అందమైన మాటే నాకే చెప్పేశావుగా
అరె వంద చందమామలున్న చోటులోకే నెట్టెసావుగా
విన్నానే. విన్నానే.
నీ పెదవే చెబుతుంటే విన్నానే.
ఉన్నానే ఉన్నానే.
తొలిప్రేమై నీలోనే ఉన్నానే
నీ పలుకే వింటూ తేనేలనే మరిచాలే
నీ అలకే కంటు ఆకలినే విడిచాలే
నీ నిద్దుర కొసం కలల తెరే తెరిచాలే
నీ మెలుకువ కొసం వెలుతురులే పడిచాలే
నువ్ మెరిసే మెరిసే హరివిల్లే నీ రంగు నేనంటా
ను కురిసే కురిసే వెన్నెలవే నీ రేయి నేనవుతా
నా పేరే పిలిచే అవసరమైనా నీకు రాదంటా
కన్నిరే తుడిచే వేలై నేను నీకు తోడుంటా
అరె ఎందరున్నా అందమైన మాటే నాకే చెప్పేశావుగా
అరె వంద చందమామలున్న చోటులోకే నెట్టెసావుగా
విన్నానే. విన్నానే.
నీ పెదవే చెబుతుంటే విన్నానే.
ఉన్నానే ఉన్నానే.
తొలిప్రేమై నీలోనే ఉన్నానే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon