చిత్రం : నా నువ్వే (2018)
సంగీతం : శరత్
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : కార్తీక్, సప్తపర్ణ చక్రవర్తి
చినికి చినికి చిలిపి గాలి తడి
తగిలి తగిలి వలపు వానజడి
కురిసి కురిసి వయసు వాగువడి
పెరిగి పెరిగి మనసు గండిపడి
వరదై వరదై ఉరుకు ప్రేమనది
ఒడులై సుడులై కడలై ఎగిసినదే
ఏమైందో ఏమైందో
ఇపుడసలేమేమి ఔతుందో సమయం
ఎం చేయ్యమంటుందో తెలియదే
తెలియదే తెలియదే తెలియదే
ఈడు బరిలో అధరాలు నిలబడి
సైనికులుగా సమరాన కలబడి
ఏది గెలుపో మరిచేంత ఎగబడి
ఆత్రపడుతూ మరికొంత మెలిపడి
ఏకం అవుతూ తికమక
ఎదో చేస్తూ సుఖముల
రాజ్యాలేలే పదవిని
పొందాయేమో పెదవులిలా
మాయ మరుపే ముసిరింది మనలను
హాయి మెరుపే తెరిచింది కనులను
తీపి తలపే కలిపింది ఎదలను
చేరువయితే అరచెయ్యి వదలను
నేనే నీవై ఇప్పుడిక
నాలో నేనే మిగలను
నీలో శ్వాసై కదులుతూ
లోలో ఆశై కరిగెదనే
చినికి చినికి చిలిపి గాలి తడి
తగిలి తగిలి వలపు వానజడి
కురిసి కురిసి వయసు వాగువాడి
పెరిగి పెరిగి మనసు గండిపడి
వరదై వరదై ఉరుకు ప్రేమనది
ఒడులై సుడులై కడలై ఎగిసినదే
ఏమైందో ఏమైందో ఇపుడసలేమేమి
ఔతుందో సమయము
ఎం చేయమంటుందో తెలియదే
తెలియదే తెలియదే తెలియదే
తెలియదే తెలియదే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon