కందిచేనుకొచ్చినావు పాట లిరిక్స్ | సీమటపాకాయ్ (2011)


చిత్రం : సీమటపాకాయ్ (2011)

సంగీతం : వందేమాతరం శ్రీనివాస్

సాహిత్యం : చిలకరెక్క గణేష్

గానం : హేమచంద్ర, ఉష


కందిచేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు

ముందు ముందు కొచ్చినావు ముద్దుపెట్ట చూసినావు

ఎట్టా ఉంది మామ ఒళ్ళు నీకేట్టా ఉంది మామ ఒళ్ళు

ఎట్టా ఉంది మామ ఒళ్ళు ఎట్టెట్ట ఉంది నీ ఒళ్ళూ..


అరె అందమంత ఆరబోసి గడ్డిమోపు ఎత్తుకోని

గట్టుమీద పోతు ఉంటె వయసు వేడి మీద ఒళ్ళు

ఇట్టిట్టా ఉంది పిల్ల ఒళ్ళూ

ఇట్టా ఉంది పిల్ల ఒళ్ళూ ఎట్టేట్టో ఉంది పిల్లా ఒళ్ళూ


దారికాచి దొంగలాగ కాపుకాస్తివి

నంగనాచి పిల్ల తొందరేంది ఆగమంటివి

వంగి వంగి గడ్డివాము చాటుకొస్తివి

నన్ను గుంజి గుంజి ముద్దులాట ఆడమంటివి

వెంటవెంట పడితీవీ వేధించి చంపుతుంటీవి

వెంటవెంట పడితీవీ వేధించి చంపుతుంటీవి


బావ నువ్వు అంటే భలే మోజు అంటివి

రోజు కొంటె లుక్కులిచ్చి నవ్వు రువ్వుతుంటివి

నిమ్మతోట కాడ నన్ను చేరమంటివి

తీర చేరినాక నువ్వు తుర్రుమంటివీ

నమ్మానమ్మ నీ మాట 

ఆశ హుష్ కాకాయె ఈ పూట

నమ్మానమ్మ నీ మాట 

ఆశ హుష్ కాకాయె ఈ పూట


మాచర్ల సంతకెళ్ళి పూలుతెస్తివి

కొప్పులోన గుచ్చమంటె నడుము నొక్కబోతివి

మంచెకాడ కొంగు పట్టి లాగబోతివి

నన్ను అటూ ఇటూ కదలకుండ చేయి పట్టుకుంటివి

పైటలాగుతుంటీవి నువ్ పరేషాను పెడుతుంటివి

పైటలాగుతుంటీవి నువ్ పరేషాను పెడుతుంటివి


ఊరిలోన పేరువున్న పోరగాడిని

నీ ఒంపుసొంపు చూసి వదిలిపెట్టలేకపోతిని

ఊరగాయలాంటి నీ ఊపు చూస్తిని

అబ్బ నోరు ఊరి ఒక్కసారి ముందుకొస్తినీ

పట్టేయ్ పిల్ల ఇంక నా చేయి

శివరాత్రే ఇంక ప్రతి రేయి

పట్టేయ్ పిల్ల ఇంక నా చేయి

శివరాత్రే ఇంక ప్రతి రేయి


కందిచేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు

ముందు ముందు కొచ్చినావు ముద్దుపెట్ట చూసినావు

ఎట్టా ఉంది మామ ఒళ్ళు నీకేట్టా ఉంది మామ ఒళ్ళు

ఎట్టా ఉంది మామ ఒళ్ళు ఎట్టెట్ట ఉంది నీ ఒళ్ళూ..


అరె అందమంత ఆరబోసి గడ్డిమోపు ఎత్తుకోని

గట్టుమీద పోతు ఉంటె వయసు వేడి మీద ఒళ్ళు

ఇట్టిట్టా ఉంది పిల్ల ఒళ్ళూ

ఇట్టా ఉంది పిల్ల ఒళ్ళూ ఎట్టేట్టో ఉంది పిల్లా ఒళ్ళూ

  

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)