చిత్రం : అదృష్ణం (1992)
సంగీతం : ఆనంద్ మిలింద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర
కూహూ కూయవా కోయిలా
ఊహూ మానవా మౌనివా
కూహూ కూయవా కోయిలా
ఊహూ మానవా మౌనివా
పాట విననీవా మోమాట పడతావా
మూతిముడిచి కూతలన్నీ మూత పెడతావా గువ్వా
అన్నానని కాదు గాని అనురాగం అణిచేవా
అదిరే ఆ పెదవుల్లో ఆనందం అదిమేవా
కూహూ కూయవా కోయిలా
ఊహూ మానవా మౌనివా
పాట విననీవా మోమాట పడతావా
మూతిముడిచి కూతలన్నీ మూత పెడతావా గువ్వా
అన్నానని కాదు గాని అనురాగం అణిచేవా
అదిరే ఆ పెదవుల్లో ఆనందం అదిమేవా
అడుగమ్మా కావాలంటే నీ గుండెల గుబగుబనీ
ఏమూలో వినిపిస్తుందీ నీ ఆశల పల్లవినీ
గుండెల్లో గుసగుసలన్నీ గుంభనగా ఉండనీ
అందరికీ తెలిసిందంటే అల్లరి పడిపోవాలీ
మంచిమాటతో చెబితే వినవా చండికా
ఏయ్ చెంప ఛెళ్ళునా కొడితే దారికి చేరవా..
కోపాలా గోపాలా ఓపని తాపాలా పాపం
అన్నానని కాదు గాని అనురాగం అణిచేవా
అదిరే ఆ పెదవుల్లో ఆనందం అదిమేవా
కలతోనే కాపురముంటే నడిరాతిరి కరిగేనా
కథలోనీ మలుపులు వింటే కాలం కొనసాగేనా
కలనైనా తోసుకువచ్చే సాక్ష్యంగా నే లేనా
కథలైనా కావ్యాలైనా మనకోసం అనుకోనా
ప్రేమ ముదిరితే పిచ్చే తెలుసా పరుగు మానుకో
పళ్ళు రాలితే పైత్యం దిగదా పంతం ఎందుకో
ఛీ అన్నా ఛా అన్నా సరసం అనుకోనా గువా
అన్నానని కాదు గాని అనురాగం అణిచేవా
అదిరే ఆ పెదవుల్లో ఆనందం అదిమేవా
కూహూ కూయవా కోయిలా
ఊహూ మానవా మౌనివా
పాట విననీవా మోమాట పడతావా
మూతిముడిచి కూతలన్నీ మూత పెడతావా గువ్వా
అన్నానని కాదు గాని అనురాగం అణిచేవా
అదిరే ఆ పెదవుల్లో ఆనందం అదిమేవా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon