గోడకు చెవులుంటేను పాట లిరిక్స్ | గోరంత దీపం (1978)


చిత్రం : గోరంత దీపం (1978)

సంగీతం : కె.వి. మహదేవన్

సాహిత్యం : ఆరుద్ర

గానం : సుశీల, బాలు


గోడకు చెవులుంటేను... నో.. నో

ఈ మేడకు కళ్ళుంటేను.. నో.. నో


గోడకు చెవులుంటే

ఈ గుసగుస వింటాయి

ఈ మేడకు కళ్ళుంటే

ఆ మిసమిస చూస్తాయి


పిట్ట మనిషి లేని చోట ఎందుకు బెదురు

సిగ్గూ బిడియాలిక్కడ చెల్లాచెదురు


గోడకు చెవులుంటేను... నో.. నో

ఈ మేడకు కళ్ళుంటేను.. నో.. నో


పూవులకే మాటలు వస్తే...

నన్ను తుంచమంటాయి

జడలో ఉంచమంటాయి


కాలి మువ్వలకే పాటలు వస్తే

నిన్ను ఆడమంటాయి

నన్ను చూడమంటాయి

గరిసస.. నిసగరిసనిసస

నినిరిరిమమరిరిగగ.. రిగపమగరి

గ.. సా.. ద.. ని..పమగరిస


ఇప్పుడు చప్పుడు చేయకుండా అత్తగారు వస్తే

నువ్వు బిత్తరపోతావు నేను కత్తులు దూస్తాను


గోడకు చెవులుంటేను... నో.. నో

ఈ మేడకు కళ్ళుంటేను.. నో.. నో


చల్లని వెన్నెలకే కమ్మదనం ఉంటే...

అది నీ మనసౌతుంది...


చల్లని కమ్మని కర్పూరానికి

నున్నదనం ఉంటే

అది నీ సొగసౌతుంది...


చల్లని కమ్మని నున్నని గాలికి

తీయదనం ఉంటే...

అది నీ మమతౌతుంది


మనసు.. సొగసు.. మమత... ఆలయమైతే

దేవతవౌతావు... ప్రణయ దేవతవౌతావు

ఆహా.. ఉమ్మ్..

ఆహా.. ఆహా...


నల్లనీ జడ చూడ నాగస్వరమాయే

నాగస్వరమూ మీద నందివర్ధనము

నాగస్వరమూదితే నాగులకు నిద్ర

జోలల్లు రాజేంద్ర భోగులకు నిద్ర..

జోజోజోజో.. జోజోజోజో..

జోజోజోజో.. జోజోజోజో..


మావారి కన్నుల్లు తమ్మి పువ్వులు...

తమ్మి పువ్వులోనా కమ్మతేనెల్లు

కోరికల పాన్పుపై  కొంగుపరిచాను

ఎవరు లేనీ చోట జోలపాడేను...


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)