శివ శివ అననేలరా పాట లిరిక్స్ | భక్త కన్నప్ప (1976)


చిత్రం : భక్త కన్నప్ప (1976)

సంగీతం : ఆదినారాయణరావు/సత్యం

సాహిత్యం : సినారె

గానం : జానకి


శివ శివ అననేలరా..

శివ శివ అననేలరా

కౌగిలిలో కైలాస మందగా..

కౌగిలిలో నే కైలాస మీయగా

శివ శివ అననేలరా


కొందరికేమో జన్మకో శివరాత్రి

ఈ సుందరికి ప్రతిరాత్రి నవరాత్రి

కొందరికేమో జన్మకో శివరాత్రి

ఈ సుందరికి ప్రతిరాత్రి నవరాత్రి


భక్తులకు బ్రతుకు గడుపగా.. గడుపగా.. ముక్తి

మనబోటి రక్తులకు.. సనిద నిదప గా మా పా

మనబోటి రక్తులకు.. సగమా గమద మనిద మదప

మనబోటి రక్తులకు... ఘడియ ఘడియకు.. ముక్తీ

శివ . . శివ   

 

శివ శివ అననేలరా

కౌగిలిలో కైలాస మందగా

కౌగిలిలో నేకైలాస మీయగా

శివ శివ అననేలరా ... రా.. రా


టక్కరి మరుని ఉక్కడగించెను

నాటి ముక్కంటి చూపు

కాలిన మదనుని మేలుకొలిపెను

నేటి నీ కొంటె చూపు


సగము మేనిలో మగువను నిలిపిన

సగము మేనిలో మగువను నిలిపిన

చంద్రధరుడు ఆ హరుడు

తనువు తనువె ఈ తరణి కొసంగిన

రసిక వరుడు.. ఈ హరుడు.. శివ.. శివ  


శివ శివ అననేలరా

కౌగిలిలో కైలాస మందగా

కౌగిలిలో నేకైలాస మీయగా..

శివ.. శివ.. శివ శివ అననేలరా.. రా.. రా..  రా


 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)