చిటాపటా చినుకులతో పాట లిరిక్స్ | అక్కాచెల్లెలు (1970)

చిత్రం : అక్కాచెల్లెలు (1970)

సంగీతం : కె.వి.మహదేవన్ 

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం : ఘంటసాల, పి.సుశీల


చిటాపటా చినుకులతో

కురిసింది వాన మెరిసింది జాణ

చిటాపటా చినుకులతో

కురిసింది వాన మెరిసింది జాణ

చిటాపటా చినుకులతో


తళాతళా మెరుపులతో

మెరిసింది పైన ఉరిమింది లోన

తళాతళా మెరుపులతో

మెరిసింది పైన ఉరిమింది లోన

తళాతళా మెరుపులతో


వచ్చే వచ్చే వానజల్లు వచ్చే వచ్చే వానజల్లు

జల్లు కాదది పొంగివచ్చు పడుచుదనం వరదలే అది

జల్లు కాదది పొంగివచ్చు పడుచుదనం వరదలే అది

వరద కాదది ఆగలేని చిలిపితనం వాగులే అది

నీ వేగమే ఇది


కురిసింది వాన మెరిసింది జాణ

చిటాపటా చినుకులతో

కురిసింది వాన మెరిసింది జాణ

చిటాపటా చినుకులతో


నల్లమబ్బు తెల్లమబ్బు ముద్దులాడుకున్నవి

చుక్కలన్ని చీకట్ల ముసుగు కప్పుకున్నవి

నల్లమబ్బు తెల్లమబ్బు ముద్దులాడుకున్నవి

చుక్కలన్ని చీకట్ల ముసుగు కప్పుకున్నవి

ఉల్లిపొర చీర తడిసి ఒంటికంటుకున్నది

ఉల్లిపొర చీర తడిసి ఒంటికంటుకున్నది


తళాతళా మెరుపులతో

మెరిసింది పైన ఉరిమింది లోన

తళాతళా మెరుపులతో


మెరిసె మెరిసె రెండు కళ్లు

మెరిసె మెరిసె రెండు కళ్లు

కళ్లు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి

కళ్లు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి

వాకిళ్ళు కావవి వలపు తేనెలూరే రసగుళ్లులే అవి

సెలయేళ్లులే ఇవి


మెరిసింది పైన ఉరిమింది లోన

తళాతళా మెరుపులతో

మెరిసింది పైన ఉరిమింది లోన

చిటాపటా చినుకులతో

కురిసింది వాన మెరిసింది జాణ

చిటాపటా చినుకులతో

Share This :



sentiment_satisfied Emoticon