చిత్రం : జల్సారాయుడు (1960)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : ఆరుద్ర
గానం : పి.బి.శ్రీనివాస్, జిక్కి
అందాల సీమలో.. ఓహో..
చందమామ కాంతిలో.. ఆహ్హా..
ఆడుకుందాం పాడుకుందాం
హాయి మనదే
అందాల సీమలో.. ఆహ్హా..
చందమామ కాంతిలో.. ఓహో..
ఆడుకుందాం పాడుకుందాం
హాయి మనదే
మల్లెపొదల నీడలోన
మరపురాని హాయిలోన
మధురమైన ఊహలందు
మనసు తేలిపోవునోయి
ఆహ్హా.. ఏహ్హే.. ఓహ్హోహో..
మల్లెపొదల నీడలోన
మరపురాని హాయిలోన
మధురమైన ఊహలందు
మనసు తేలిపోవునోయి
పరవశాన మేనులు మరచి
గడుపుదాము జీవితం
అందాల సీమలో
చందమామ కాంతిలో
ఆడుకుందాం పాడుకుందాం
హాయి మనదే
నిగనిగలా తారలు తెచ్చి
నీ సిగలో ముడిచెద చెలియా
నీలి నీలి మేఘములందు
నీవు నేను ఏకమవుదాం
ఆహ్హా...ఓహ్హో..ఓఓఓఓ..
నిగనిగలాడే తారలు తెచ్చి
నీ సిగలో ముడిచెద చెలియా
నీలి నీలి మేఘములందు
నీవు నేను ఏకమవుదాం
నీ నీడగ మెలిగెదనోయి
నా నోములు పండునోయి
అందాల సీమలో
చందమామ కాంతిలో
ఆడుకుందాం పాడుకుందాం
హాయి మనదే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon