అన్నయ్యా అన్నావంటే ఎదురవనా పాట లిరిక్స్ | అన్నవరం (2006)


చిత్రం : అన్నవరం (2006)

సంగీతం : రమణ గోగుల

సాహిత్యం : చంద్రబోస్

గానం : మనో, గంగ


అన్నయ్యా అన్నావంటే ఎదురవనా

అలుపై ఉన్నావంటే నిదరవనా

కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా

కలతై ఉన్నావంటే కథనవనా

అమ్మలో ఉండే సగం అక్షరం నేనే

నాన్నలో రెండో సగం లక్షణం నేనే


అమ్మ తోడు.. నాన్న తోడు..

అన్నీ నీకు అన్నే చూడు 

 

చెల్లిపోని బంధం నేనమ్మా

చిట్టి చెల్లెమ్మా వెళ్లిపోని చుట్టం నేనమ్మా

అన్నలోని ప్రాణం నువ్వమ్మా

చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా


చూపులోన దీపావళి.. నవ్వులోన రంగోళి

పండుగలు నీతో రావాలి..

నా గుండెలోన వేడుక కావాలి

రూపులోన బంగారు తల్లి మాట మరుమల్లి

రాముడింట ప్రేమను పంచాలి

ఆ సీత లాగా పేరుకు రావాలి

నీలాంటి.. అన్నగానీ ఉండే ఉంటే.. తోడూనీడా

ఆనాటి సీతకన్ని కష్టాలన్నీ కలిగుండేవా


వాహ్ చెల్లిపోని బంధం నేనమ్మా

చిట్టి చెల్లెమ్మా వెళ్లిపోని చుట్టం నేనమ్మా

అన్నలోని ప్రాణం నువ్వమ్మా

చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా


కాలి కింది నేలను నేనే నీలి నింగి నేనే

కన్నులోని నీరే నేనమ్మా..

ఆ నన్ను నువ్వు జారనీకమ్మా

ఇంటి చుట్టు గాలిని నేనే తోరణాన్ని నేనే

తులసిచెట్టు కోటను నేనమ్మా

నీ.. కాపలాగా మారనీవమ్మా

ముక్కోటి దేవతలా అందరి వరం అన్నవరం

ఇట్టాంటి అన్న తోడు అందరికుంటే భూమే స్వర్గం


చెల్లిపోని బంధం నేనమ్మా

చిట్టి చెల్లెమ్మా వెళ్లిపోని చుట్టం నేనమ్మా

అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా

ప్రాణమైన చెల్లిస్తానమ్మా..


అన్నయ్యా అన్నావంటే ఎదురవనా

అలుపై ఉన్నావంటే నిదరవనా

కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా

కలతై ఉన్నావంటే కథనవనా

అమ్మలో ఉండే సగం అక్షరం నేనే

నాన్నలో రెండో సగం లక్షణం నేనే

అమ్మ తోడు నాన్న తోడు

అన్నీ నీకు అన్నే చూడు


చెల్లిపోని బంధం నేనమ్మా

చిట్టి చెల్లెమ్మా వెళ్లిపోని చుట్టం నేనమ్మా

అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా

ప్రాణమైన చెల్లిస్తానమ్మా..

 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)