విన్నవించుకోనా చిన్న కోరిక పాట లిరిక్స్ | బంగారు గాజులు (1968)

 చిత్రం : బంగారు గాజులు (1968)

సంగీతం : టి.చలపతిరావు

సాహిత్యం : దాశరధి

గానం : ఘంటసాల, సుశీల


విన్నవించుకోనా చిన్న కోరిక

ఇన్నాళ్ళూ నా మదిలో ఉన్న కోరికా ఆ.

విన్నవించుకోనా చిన్నకోరికా


నల్లనీ నీ కురులలో

తెలతెల్లనీ సిరిమల్లెనై

నల్లనీ నీ కురులలో

తెలతెల్లనీ సిరిమల్లెనై

పరిమళాలు చిలుకుతూ

నే పరవశించిపోనా.. ఆ..


విన్నవించుకోనా చిన్నకోరికా


వెచ్చనీ నీ కౌగిట 

పవళించినా నవవీణనై

వెచ్చనీ నీ కౌగిట

పవళించినా నవవీణనై

రాగమే అనురాగమై

నీ మనసు నిండిపోనా.. ఆ.


విన్నవించుకోనా చిన్నకోరికా


తియ్యనీ నీ పెదవిపై

చెలరేగిన ఒక పాటనై

తియ్యనీ నీ పెదవిపై

చెలరేగిన ఒక పాటనై

అందరాని నీలి నింగి

అంచులందుకోనా.. ఆ.


విన్నవించుకోనా చిన్నకోరికా


చల్లనీ నీ చూపులే

తెలివెన్నెలై విరబూయగా

చల్లనీ నీ చూపులే

తెలివెన్నెలై విరబూయగా

కలువనై నీ చెలియనై

నీ కన్నులందు వెలిగేనా.. ఆ.


విన్నవించుకోనా చిన్న కోరిక

ఇన్నాళ్ళూ నా మదిలో ఉన్న కోరికా ఆ.

విన్నవించుకోనా చిన్నకోరికా 


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)