చిత్రం : కథానాయిక మొల్ల (1970)
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం : దేవులపల్లి
గానం : జానకి
విందువా వీనుల విందుగా
గోవిందునాండాళ్ళు పరిణయమ్మైన గాథ
ఉన్నదా విల్లి పుత్తూరు అందుగలరు
శ్రీహరి కింకరులు పెరియాళ్వారు
వారి చిన్నారి కుమారి ఆండాళ్ళు
శ్రీ తులసీ వనములోన వెలసే కూన
అయ్యకన్నను మిన్న ఆ కన్నె
శ్రీరంగ పురిని వేంచేసిన హరిన వలచి
పతిగా కొలిచి మేటి వ్రతమూని
కృతులన్ని సరసిజాక్షుని అలంకరణమునకు
ఏరి పూలా కూరిచి మాలా ఎలమిదాని
ముదిత తన క్రొమ్ముడిని మునుముందె ముడిచి
అద్దమున చూచి తలయూచి అలరే
అవల కోవెలకేగి పెరుమాళ్ళకొసగుచుండె..ఏ..
ఏ..ఏఎ...ఆఆఅ..ఆ
అపుడా శ్రీహరి
చెదరదుగదే చెలువ చిత్తము రవంతా..ఆఅ..ఆ
పెరచింత విడనాడుకొని నన్నె
హృదయమున నిలుపుకొనె పదిలముగా ఆఅ..
అని మెచ్చి సదయుడై
శ్రీరంగ నగరీ సదనుడు ఆళ్వారుల కదలి రావించి
ఆ సుదతి తన దేవిగ వరించెన్
ముదమొందె ముల్లోకములును..
గోదాదేవి భువనమోహనుడు పెండ్లాడగా..ఆఅ..ఆ
చూశావా మొల్ల తులసీ వనములోన దొరికిన మొలక
అలహరి వలపు పంజరపు రాచిలుకా..ఆఅ..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon